దుబ్బాకలో పూర్తికాని కౌంటింగ్ .. 4 ఈవీఎంలు లెక్కించాల్సి ఉందన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

0
41

దుబ్బాక ఉపఎన్నికలో విజయంపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే భాజపా విజయం ఖరారైప్పటికీ 4 ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. ఈ నాలుగు ఈవీఎంలలో 1,669 ఓట్లు ఉన్నట్లు తెలిపారు. 21, 188 పోలింగ్‌ కేంద్రాల్లో ఫలితం రాలేదని, వీటితోపాటు 136,157/A పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ తర్వాత క్లియర్‌ చేయలేదని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. అయితే 23 రౌండ్లు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఒకవేళ పెండింగ్‌లో ఉన్న ఓట్లలో ఎక్కువ శాతం తెరాస అభ్యర్థికి పోలైతే విజయం తారుమారయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here