జనగామ జిల్లా కేంద్రానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంతెన మణి తన పుట్టిన రోజు సందర్భంగా లయన్స్ క్లబ్ అఫ్ జనగామ వారికి 21 మంది అవయవ దానాలు చేస్తామని అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యఅతిథిగా జనగామ మున్సిపల్ చైర్మెన్ పోకల జమున లింగయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ లయన్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ మంతెన మణిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమములో 2వ వార్డు కౌన్సిలోర్ వాన్కుడోతు అనిత , GMT మెంబెర్ తీరుపెల్లి కృష్ణా రెడ్డి, జోన్ చైర్మన్ కృష్ణ జీవన్ బజాజ్, అధ్యక్షుడు దారం నాగయ్య, మంగళంపల్లి రాజు, మార్త వీరేందర్ పాల్గొన్నారు. కాగా అవయవ దానానికి అంగీకారం తెలిపిన వారిలో మంతెన మణి, మంగళంపల్లి రాజు, తుంగ కౌశిక్ , సల్లా మహేష్, అంబాల శివ, మార్త వీరేందర్, ఎర్రం శివ, చిక్కుడు నాగేష్, రోడ్డ కిట్టు, బెజడి హరీష్, అంబటి అజయ్, ఆశోక్, ఉన్నారు.