వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా ఉండ టానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది
srsp కెనాల్ ద్వారా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వటం వల్ల పంటలు మంచిగా పండుతున్నాయి.
కరోనా నేపథ్యం లో లారీ లు , గన్ని బ్యాగ్ లు ,ట్రాన్స్పోర్ట్ వంటి సమస్యలు వచ్చాయి.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచటం జరిగింది.
కేంద్రం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసినా, మన ముఖ్యమంత్రి కేసీఅర్ గారు రైతులను ఆదుకోవాలని కోరారు.
దేశం లో ఎవరు కూడా రైతులను పట్టించుకునే పాపాన పోలేదు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఏలుతున్న రాష్ట్రాల్లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
దేశం లో ఎక్కడ లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఅర్ ప్రభుత్వమే
వ్యవసాయం ద్వారా ఆర్థికంగా అంద రూ ఎదగాలని అప్పులు ఐనా, కెసిఆర్ రైతులను ఆదుకుంటాన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకున్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆపకుండా చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ అధికారులు, ఐకెపి సంఘాలు సమన్వయం తో పనిచేయాలి
స్థానిక ప్రజా ప్రతినిధుల కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జారకుండా చూడకుండా చూడాలి
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించా లి
కొడకండ్ల లో జరిగిన కేసీఅర్ సభ లో రైతుల కోసం చాలా విషయాలు తెలిపారు.
రైతులు ఇబ్బందులు పడకుండా ధరణి సైట్ ఏర్పాటు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో మంచి పని తనం చూపిన సంఘాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తాం
ఈ నెల 10 తర్వాత రైతుల కోసం మరిన్ని పథకాలను మన ముఖ్యమంత్రి కేసీఅర్ గారు అమలు చేయబోతున్నారు.
సా దా బైనమా ద్వారా రైతులకు మరోసారి అవకాశం కల్పిస్తూ తొందరగా పట్టా దార్ పాసు పుస్తకాలు ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, రైతులు పాల్గొన్నారు